Tuesday, August 1, 2017

India - save comrade Padma! ICSPWI



కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తన సహచరుణ్ణి కలవడానికి కేరళ నుండి తమిళనాడు కు వస్తున్న ఆమెను ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు ? పద్మను కిడ్నాప్ చేసిన ఆ గుర్తుతెలియని వ్యక్తులు మనుషులను ఎత్తుకెళ్ళి ఎన్ కౌంటర్లు చేయడంలో మహా ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ఎస్సైబీ పోలీసులేనని పద్మ సహచరుడు వివేక్ చేస్తున్న ఆరోపణ నమ్మని వాళ్ళుంటారా ? కానీ ఇప్పటివరకు పోలీసులు పద్మ కిడ్నాప్ పై నోరు మెదపడం లేదు. పద్మను కిడ్నాప్ చేసిన మరుసటి రోజు పోలీసులు జర్నలిస్టులకు కొన్ని లీకులిచ్చారు. ఆమెను చిత్తూరు తీసుకొస్తున్నామని, చెన్నైలో ఓ కేసుందని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఇలా రకరకాల లీకులు వదిలారు . కానీ తర్వాత మాత్రం పద్మ గురించి తమకేమీ తెలియాని, ఆమెను అసలు అరెస్టే చేయలేదని చేప్పడం మొదలుపెట్టారు. మొత్తానికి కామ్రేడ్ పద్మను ఏం చేశారన్నది మిస్టరీ.
లాయర్లు ఆమె ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ లు వేశారు. అయినా ఆచూకి మాత్రం తెలియడం లేదు. పద్మ‌ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతుల్లోనే ఉన్నదని, ఆమెను తక్షణం కోర్టులో హాజరుపర్చాలని ఆర్డీఎఫ్ అధ్యక్షుడు వరవరరావు డిమాండ్ చేశారు.
ఎంతో మంది విప్లవకారులను ఎన్కౌంటర్లు చేసిన, మాయం చేసిన చరిత్ర పోలీసులది. అందువల్లనే పద్మ గురించి ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఆ కామ్రేడ్ విడుదలకై వివిధ ప్రజా సంఘాలు, ప్రజా స్వామికవాదులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించడానికి సిద్దమవుతున్నారు. అందరూ తమతో కలిసి రావాలని విఙప్తి చేస్తున్నారు. రండి మనకు వీలైన పద్దతుల్లో కామ్రేడ్ పద్మ విడుదలకై పోరాడుదాం.

(2017-08-01 06:55:20)

No comments:

Post a Comment